మాజీ సీఎం కుమారుడికి కరోనా

ABN , First Publish Date - 2020-08-16T23:06:10+05:30 IST

మాజీ సీఎం కుమారుడికి కరోనా

మాజీ సీఎం కుమారుడికి కరోనా

పనాజి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గోవా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ గోవా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత ఉత్పాల్ పారికర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్లు గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు, బీజేపీ నాయకుడు ఉత్పాల్ పారికర్ అన్నారు.


Updated Date - 2020-08-16T23:06:10+05:30 IST