రూ.7.50 కోట్ల ‘టీచర్‌ ప్రైజ్‌’ రేసులో మనోడు

ABN , First Publish Date - 2020-10-27T06:50:11+05:30 IST

మహారాష్ట్ర లోని సోలాపూర్‌ జిల్లా పరిటెవాడీ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు,

రూ.7.50 కోట్ల ‘టీచర్‌ ప్రైజ్‌’ రేసులో మనోడు

మహారాష్ట్ర ఉపాధ్యాయుడు రంజిత్‌సిన్హ్‌ దిశాలే ఘనత


లండన్‌, అక్టోబరు 26: మహారాష్ట్ర లోని సోలాపూర్‌ జిల్లా పరిటెవాడీ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, 31 ఏళ్ల రంజిత్‌సిన్హ్‌ దిశాలే అరుదైన ఘనత సాధించారు. బ్రిటన్‌కు చెందిన ‘వార్కే ఫౌండేషన్‌-యునెస్కో’ 2020 సంవత్స రానికి అందించే రూ.7.50 కోట్లు విలువ చేసే ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’ ఫైనలిస్టుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది దరఖాస్తు చేసుకోగా, 10 మందితో కూడిన తుది జాబితాలో రంజిత్‌కు చోటు దక్కడం విశేషం. ప్రైజ్‌ విజేతను త్వరలో ప్రకటిస్తారు.


ఇంజనీరింగ్‌ చేసిన రంజిత్‌.. తండ్రి సలహా మేరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారారు. ఆయన 2009 నుంచి పరిటెవాడీ జడ్పీపీఎస్‌లో పనిచేస్తున్నారు. బాలికా విద్యను ప్రోత్సహించడంలో, వారి హాజరు శాతాన్ని 100కు చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. పరిటెవాడీ గ్రామం కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. విద్యార్థుల మాతృ భాష కావడంతో మరాఠీలో పాఠాలు అర్ధం చేసుకో లేకపోవడాన్ని చూడలేక రంజిత్‌ కన్నడం నేర్చుకు న్నారు.

పాఠ్య పుస్తకాలను కన్నడంలోకి అనువదిం చారు. పాఠాల్లోని పద్యాలు, గేయాలు, వీడియో లెక్చర్లు, కథలు, ఉపాధ్యాయులు ఇచ్చే అసైన్‌ మెంట్లు మొబైల్‌ఫోన్లలో వినేందుకు వీలుగా టెక్ట్స్‌ పుస్తకాలకు ‘క్యూఆర్‌ కోడింగ్‌’లో సంక్షిప్తం చేశారు.


Updated Date - 2020-10-27T06:50:11+05:30 IST