రాహుల్ కోసం మన్మోహన్ మధ్యలోనే నిష్క్రమించాలని భావించారా?

ABN , First Publish Date - 2020-08-20T16:46:04+05:30 IST

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో అర్ధాంతరంగా మధ్యలోనే రాజీనామా చేయాలని భావించారా?

రాహుల్ కోసం మన్మోహన్ మధ్యలోనే నిష్క్రమించాలని భావించారా?

న్యూఢిల్లీ : మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో అర్ధాంతరంగా మధ్యలోనే రాజీనామా చేయాలని భావించారా? పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేసి రాహుల్ గాంధీ ప్రధాని పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగుమం చేయాలని నిశ్చయించుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలాయే వెల్లడించారు.


‘‘రాహుల్ గాంధీ ప్రధాని పగ్గాలు చేపట్టడానికి వీలుగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయడానికి సిద్ధమైపోయారు. కానీ... ఆ తర్వాత ఆ ప్రతిపాదనను రాహుల్ తిరస్కరించారు.’’ అని ఆయన వెల్లడించారు.


కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ తిరిగి పగ్గాలు చేపట్టాలని చాలా మంది కార్యకర్తలు కోరుకుంటున్నారని, అధికారం ఉన్నా... లేకపోయినా... గాంధీ కుటుంబం దేశానికి, పార్టీకి సేవ చేసిందని ఆయన తెలిపారు. మోదీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా, దాడులకు దిగినా వాటిని లెక్క చేయకుండా రాహుల్ పార్టీని ధైర్యంగా నడిపించారని, ఇలాంటి నేతలే కాంగ్రెస్‌కు, దేశానికి అవసరమని సూర్జేవాలా పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-20T16:46:04+05:30 IST