మన్మోహన్‌కు ఛాతీనొప్పి.. ఎయిమ్స్‌లో చేరిక

ABN , First Publish Date - 2020-05-11T08:01:29+05:30 IST

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో రాత్రి 8:30 గంటలకు ఎయిమ్స్‌లో చేర్చారు. కార్డియోకు సంబంధించిన వార్డులో...

మన్మోహన్‌కు ఛాతీనొప్పి.. ఎయిమ్స్‌లో చేరిక

న్యూఢిల్లీ, మే 10: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో రాత్రి 8:30 గంటలకు ఎయిమ్స్‌లో చేర్చారు. కార్డియోకు సంబంధించిన వార్డులో ఆయన్ను అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి. 87 ఏళ్ల మన్మోహన్‌ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు.  


Updated Date - 2020-05-11T08:01:29+05:30 IST