యూపీయే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలపై మనీశ్ తివారీ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-08-01T18:38:44+05:30 IST

డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వంపై విమ్శలు చేస్తున్న

యూపీయే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలపై మనీశ్ తివారీ ఆగ్రహం

న్యూఢిల్లీ : డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వంపై విమ్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ సీనియర్ నేత మనీశ్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంపై పోరాడటానికి బదులుగా యూపీయే ప్రభుత్వంపై విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు. 


మనీశ్ తివారీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘2004 నుంచి 2014 వరకు బీజేపీ అధికారంలో లేదు. అప్పటి వారి ఇబ్బందికర పరిస్థితి గురించి ఆ పార్టీ నేతలు వాజ్‌పేయిని కానీ, ఆయన ప్రభుత్వాన్ని కానీ కనీసం ఒక్కసారి అయినా నిందించలేదు. కాంగ్రెస్‌లో దురదృష్టవశాత్తూ, కొందరు సరైన సమాచారం లేనివారు బీజేపీ/ఎన్డీయేపై పోరాడటానికి బదులుగా డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. 


సమైక్యంగా ఉండవలసిన సమయంలో విభజన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 

Updated Date - 2020-08-01T18:38:44+05:30 IST