మ్యాన్‌హోల్ మూతలపై వెలుగులు వెదజల్లే కార్టూన్లు!
ABN , First Publish Date - 2020-08-21T04:38:33+05:30 IST
జాపాన్‌లోని టోకొరాజోవా నగరంలో ఓ సిరకొత్త దృశ్యం అక్కడి పౌరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

టోక్యో: జాపాన్‌లోని టోకొరాజోవా నగరంలో ఓ సరికొత్త దృశ్యం అక్కడి పౌరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. త్వరలో ప్రారంభం కాబోయే ఓ సాంస్కృతిక ప్రదర్శనశాల ముందు ఉన్న మ్యాన్‌హోళ్లపై అక్కడి అధికారులు జపాన్‌లో బాగా పాపులరైన కార్టూన్ క్యారెక్టర్ చిత్రాలను రూపొందించారు. రాత్రి పూట వెలుగు విరజిమ్ముతూ చూపరులను ఆశ్చర్యపోయేలా చేయడం వీటి ప్రత్యేకత. జాపాన్ సంస్కృతిలో భాగమైన ప్రత్యేక కార్టూన్లకు ఆ ప్రదర్శనశాల పెద్ద పీట వేయనుంది. ఈ నేపథ్యంలో వీటికి మరింత ప్రచారం కల్పించేందుకు అక్కడి అధికారులు ఈ ఐడియాను అమలు చేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకోవడంతో పాటూ స్థానికంగా జరిగే నేరాల సంఖ్యను కూడా ఈ రకమైన ప్రచారం తగ్గించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.