స్వీడన్ యువతిని మూడు పద్ధతుల్లో పెళ్లాడిన యువకుడు
ABN , First Publish Date - 2020-02-08T16:27:52+05:30 IST
నామక్కల్ జిల్లా తిరుచెంగోడు ప్రాంతానికి చెందిన యువ ఇంజనీర్ తను ప్రేమించిన స్వీడన్ యువతిని మూడు పద్ధతుల్లో వివా హం చేసుకుని ఇరువైపు

చెన్నై(ఆంధ్రజ్యోతి): నామక్కల్ జిల్లా తిరుచెంగోడు ప్రాంతానికి చెందిన యువ ఇంజనీర్ తను ప్రేమించిన స్వీడన్ యువతిని మూడు పద్ధతుల్లో వివా హం చేసుకుని ఇరువైపు కుటుంబీకులనే కాక స్థానిక ప్రజలను ఆశ్చర్య పరిచాడు. తిరుచెంగోడుకు చెందిన ధరణి అనే యువకుడు ఎంటెక్, ఎంఎస్ చదివి స్వీడన్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అంతకు ముందు స్వీడన్‌లో ఎంఎస్ చదువుతున్నప్పుడు ధరణికి స్టాక్‌హోమ్ ప్రాం తంలో మరీనా సూసైన్ అనే క్రైస్తవ యువతితో పరిచ యం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఇద్దరి కుటుంబీకులు అడ్డుచెప్పలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం వీరి వివాహం క్రైస్తవ మతాచారం ప్రకారం, హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ముందుగా క్రైస్తవ మతగురువు సమక్షంలో బంగారు ఉంగరాలు వేలికి తొడుక్కుని దండలు మార్చుకుని వివా హం చేసుకున్నారు. ఆ తర్వాత ఓ కల్యాణ మండపంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ధరణి వధువు మరనీ సూసైన్ మెడలో తాళికట్టాడు. ఈ పెళ్ళిలో ఇరువైపు కుటుంబీకులు స్నేహితులు, బంధువు లు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత ధరణి తల్లి దండ్రులు పెరియార్ సిద్ధాంతాలను పాటిస్తున్నందుకు వారిని సంతోషపెట్టేలా మధ్యాహ్నం ఎలాంటి మంగళవాయిద్యాలు ఇతర సందడిలేకుండా జీవితాంతం తో తోడుగా ఉంటానని తమిళంలో ప్రమాణం చేసి దండ లు మార్చుకుని ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఇలా ఒకే రోజు మూడు పద్ధతుల్లో ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంటను చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యం చెందారు.