నిలిచిపోయిన 108 సేవలు.. దేవ‌ప్రయాగ్‌లో వ్యక్తి ఉదారత..

ABN , First Publish Date - 2020-03-28T19:12:25+05:30 IST

కోవిడ్-19 దేశ వ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని థేరీ జిల్లా దేవప్రయాగ్‌‌కు చెందిన గణేశ్ భట్ అనే వ్యక్తి తన

నిలిచిపోయిన 108 సేవలు.. దేవ‌ప్రయాగ్‌లో వ్యక్తి ఉదారత..

డెహ్రాడూన్: కోవిడ్-19 దేశ వ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని థేరీ జిల్లా దేవప్రయాగ్‌‌కు చెందిన గణేశ్ భట్ అనే వ్యక్తి తన ఉదారతను చాటుకొని, అందరికీ ఆదర్శంగా నిలిచాడు. వైద్య సేవలు అందుబాటులో లేని ప్రాంతాల వారికి వైద్య సేవలు, 108 వాహనాలు అందుబాటులో లేని ప్రాంతాల వారికి కోసం అతను తన కారునే అంబులెన్సుగా మార్చాడు. తద్వారా అతను ఇప్పటివరకూ 22మందికి వైద్యసేవలు అందిచగలిగాడు. ఇందులో ఇద్దరు గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు. 


‘‘వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి. అప్పటికే చాలావరకూ వైద్య సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో నేను నా ‘నానో’ కారును వైద్యసేవలు అందిచేందుకు వినియోగించాలని భావించాను. అతని చిన్నది అయినా.. ఎంతో వేగంగా వెలుతుంది.. పైగా ఎక్కువ మైలేజీ కూడా ఇస్తుంది’’ అని గణేశ్ తెలిపాడు. 


అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజల్లో విధుల్లో తిరిగేందుకు పోలీసులు అనుమతించడం లేదు. అయితే తాను వైద్యసేవల కోసం చేస్తున్న ఈ పనికి అధికారుల నుంచి కూడా సహకారం లభిస్తుందని గణేశ్ పేర్కొన్నాడు. ‘‘ప్రజలు, అధికారులు, పోలీసులు నా కారును గుర్తిస్తారు. ఒకవేళ ఎవరైనా గుర్తించని పక్షంలో వారిని మేము నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాము. ఒకసారి వాళ్లు రోగిని చూసిన తర్వాత మేము వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు’’ అని అతను పేర్కొన్నాడు. 


గణేశ్ తన కారు ముందు, వెనక తన ఫోన్ నెంబర్‌ని అంటించాడు. తద్వారా అవసరంలో ఉన్న వాళ్లు ఆ నెంబర్‌ని చూసి అతని సహాయాన్ని కోరే అవకాశాన్ని కల్పించాడు. గణేశ్ అతని ఇద్దరు స్నేహితులు కూడా సహాయం చేస్తున్నారు. 


‘‘గత రాత్రి నాకు డెహ్రాడూన్‌ నుంచి థెరీ వరకూ నడిచి వెళ్తున్న వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ల పాదాల నుంచి రక్తం ప్రవాహంలా కారుతుంది. కనీసం అడుగుతీసి అడుగుపెట్టే పరిస్థితుల్లో కూడా వాళ్లు లేరు. దీంతో మేము అక్కడి వెళ్లి వాళ్లని మా స్నేహితుడి ఇంటికి తరలించాము’’ అని గణేశ్ వివరించాడు. గర్భిణీ స్త్రీలు, గుండె వ్యాధి ఉన్నవాళ్లు, తీవ్రగాయాలతో బాధపడుతున్నవారిని రక్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని అతను అన్నాడు. 


దీంతో పాటు.. రవాణ సౌకర్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మందులు, శానిటైజర్లు, చిన్నారులకు పాలు.. ఇతరాత్ర వస్తువులు కూడా సరఫరా చేస్తున్నామని తెలిపాడు. 

Updated Date - 2020-03-28T19:12:25+05:30 IST