క్వారంటైన్ సెంటర్‌ ఏర్పాటులో ఘర్షణ.. వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-04-06T00:11:42+05:30 IST

కోవిడ్-19 బాధితుల కోసం ఏర్పాట చేసే క్వారంటైన్ సెంటర్ విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమబెంగాల్

క్వారంటైన్ సెంటర్‌ ఏర్పాటులో ఘర్షణ.. వ్యక్తి మృతి

బిర్బ్‌హమ్: కోవిడ్-19 బాధితుల కోసం ఏర్పాట చేసే క్వారంటైన్ సెంటర్ విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమబెంగాల్ బిర్బ్‌హమ్ జిల్లాలోని పరుయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలిబ్‌‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 


గ్రామంలోని ఓ పాఠశాలలో ఈ క్వారంటైన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులు భావించారు. అయితే గ్రామంలోని ఓ వర్గానికి చెందిన ప్రజలు దీన్ని వ్యతిరేకించగా.. మరో వర్గం వారు సమర్థించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కత్తులు, బాంబులతో ఒకరిపై మరొకరు దాడికి తెగబడ్డారు. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయాలపాలు అయ్యారు. 


విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గ్రామంలో కొంత ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ.. పరిస్థితి అదుపులోనే ఉందని వాళ్లు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. 

Updated Date - 2020-04-06T00:11:42+05:30 IST