తన భార్యను తీసుకెళ్లాడని కక్షతో...
ABN , First Publish Date - 2020-10-07T14:21:59+05:30 IST
స్థానిక సలవన్‌పేట కచ్చేరి వీధికి చెందిన గోపి (38) అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏడాది క్రితం ఆమెతో బెంగుళూరు వెళ్లిన గోపి అక్కడే నివాసం

చెన్నై : స్థానిక సలవన్‌పేట కచ్చేరి వీధికి చెందిన గోపి (38) అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏడాది క్రితం ఆమెతో బెంగుళూరు వెళ్లిన గోపి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సోమవారం రాత్రి గోపి వేలూరుకు వచ్చాడు. ఆ సమయంలో తన భార్యను తీసుకెళ్లాడన్న ఆగ్రహంతో శరవణన్ కత్తితో గోపిపై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చుట్టుపక్కల వారు గోపిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతను మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన వేలూరు పోలీసులు శరవణన్‌ను అరెస్ట్ చేశారు.