నలుగురు కుటుంబసభ్యులు.. ఓ అద్దె విమానం!
ABN , First Publish Date - 2020-05-29T07:18:45+05:30 IST
లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వారు సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పుడెలాంటి ఇబ్బందులు లేవు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకుంటే చాలు ఒకట్రెండు రోజుల్లో ఈ-పా్‌సలు...

భోపాల్, మే 28: లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వారు సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పుడెలాంటి ఇబ్బందులు లేవు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకుంటే చాలు ఒకట్రెండు రోజుల్లో ఈ-పా్‌సలు ఇచ్చేస్తున్నారు. ఆ ఆసామి మాత్రం ఈ-పాస్ బుక్ చేసుకోలేదు. తన నలుగురు కుటుంబసభ్యులను తరలించేందుకు ప్రత్యేకంగా ఓ విమానాన్నే అద్దెకు తీసుకున్నాడు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన బడా మద్యం వ్యాపారి జగదీశ్ అరోరా. తన ఇద్దరు పిల్లలు, పనిమనిషితో కలిసి ఆయన కూతురు ఢిల్లీ నుంచి భోపాల్‌లోని పుట్టింటికి వచ్చింది. లాక్‌డౌన్‌తో వారక్కడే చిక్కుకుపోయారు. కరోనాతో రిస్క్ ఎందుకనుకున్నాడో ఏమో ఏకంగా 180 సీట్ల సామర్థ్యం ఉన్న ఏ-320 విమానాన్ని జగదీశ్ అద్దెకు తీసుకున్నాడు. ఈనెల 25న ఆ విమానం.. ఢిల్లీ నుంచి భోపాల్‌కు వచ్చింది. సిబ్బందిని పక్కనబెడితే విమానంలో ఆ నలుగురు మాత్రమే కూర్చున్నారు. గంటన్నరలో వారిని ఢిల్లీలో దిగబెట్టిందా విమానం. దీనికి రూ.20 లక్షలు చెల్లించాడు జగదీశ్.