ఆస్పత్రి నుంచి వెళ్లగొట్టారు.. ఇంటికెళ్లే దారిలోనే కుప్పకూలిపోయాడు..

ABN , First Publish Date - 2020-04-02T00:15:19+05:30 IST

కొబ్బరిచెట్టు నుంచి కిందపడిపోవడంతో.. మంగళూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం కోసం చేరిన బాలన్(55) అనే వ్యక్తి ఆ ఆస్పత్రికి చెందిన వైద్యులు

ఆస్పత్రి నుంచి వెళ్లగొట్టారు.. ఇంటికెళ్లే దారిలోనే కుప్పకూలిపోయాడు..

కసరగోడ్/కేరళ: కొబ్బరిచెట్టు నుంచి కిందపడిపోవడంతో.. మంగళూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం కోసం చేరిన బాలన్(55) అనే వ్యక్తి ఆ ఆస్పత్రికి చెందిన వైద్యులు బలవంతంగా వెళ్లగొట్టారు. దీంతో తన ఇంటికి చేరుకొనేందుకు కాలినడకన ప్రయాణం సాగించిన అతను 50 కిలోమీటర్లు నడిచి.. కసరగోడ్ సరిహద్దు సమీపంలో కుప్పకూలిపోయాడు. 


మంగళూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వైద్యులు బాలన్‌ను బలవంతంగా ఖాళీ చేయిండంతో దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్ కారణంగా తను తన స్వగ్రామం కసరగోడ్ చేరుకొనేందుకు రవాణా సౌకర్యం లేకుండా పోయింది. దీంతో అతను తన బంధువుతో కలిసి కాలినడకన స్వగ్రామానికి వెళ్లేందుకు ప్రయాణం ప్రారంభించాడు. అయితే కసరగోడ్ ఇంకొంత సమయంలో చేరుతాడనగా.. అతను కుప్పకూలిపోయాడు.


విషయం తెలుసుకుని ఘటనస్థలానికి చేరుకొని అతన్ని కన్హాగడ్‌లోని తన బంధువు ఇంట్లో దింపామని కరసగోడ్ ఎస్పీ పీఎల్ సాబు పేర్కొన్నారు. ‘‘శుక్రవారం అతన్ని బలవంతంగా ఆస్పత్రి నుంచి బలవంతంగా గెంటేశారని చెబుతున్నాడు. కసరగోడ్ చెక్‌పాయింట్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో అతను స్పృహతప్పి పడిపోయడు. జిల్లా పోలీసులు వెంటనే దీన్ని తెలుసుకొని వాహనంలో అతన్ని ఇంటి వద్ద దింపారు’’ అని సాబు తెలిపారు. 

Updated Date - 2020-04-02T00:15:19+05:30 IST