అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసేందుకు.. సైకిల్‌పై ముంబై నుంచి జమ్మూ కాశ్మీర్‌కు....

ABN , First Publish Date - 2020-04-06T01:36:59+05:30 IST

మహమ్మద్ ఆరిఫ్, ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో ఉన్న లిబ్రా టవర్‌ వద్ద సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. అయితే ఉన్నట్లుండి...

అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసేందుకు.. సైకిల్‌పై ముంబై నుంచి జమ్మూ కాశ్మీర్‌కు....

చండీఘర్: మహమ్మద్ ఆరిఫ్, ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో ఉన్న లిబ్రా టవర్‌ వద్ద సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. అయితే ఉన్నట్లుండి సైకిల్‌పై జమ్మూ కాశ్మీర్‌ బయలుదేరాడు. తన తండ్రికి అనారోగ్యంగా ఉందని కబురందడంతో ఎలాగైనా అతడిని చూడాలని అనుకున్నాడు. ఓ స్నేహితుడి నుంచి సైకిల్ కొనుగోలు చేశాడు. దానిపై ముంబైలోని బాంద్రా నుంచి జమ్మూలోని తన సొంత ఊరైన రాజౌరీ వెళ్లేందుకు గురువారం బయలుదేరాడు. ఈ ప్రయాణం గురించి ఆరీఫ్‌ను ప్రశ్నించగా.. ‘నా తండ్రికి అనారోగ్యంగా ఉందని ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. దేశం మొత్తం లాక్‌డౌన్ ఉండడంతో మా ఊరికి వెళ్లేందుకు వేరే మార్గం లేకపోయింది. అయితే ఎలాగైనా మా ఊరు వెళ్లి నాన్నను చూడాలనుకున్నా. అందుకే 2,100 కి.మీల దూరమైనా సైకిల్‌పై బయలుదేరా’ అని చెప్పుకొచ్చాడు. 


ఇదిలా ఉంటే దీనిపై జమ్మూ కాశ్మీర్ అధికారులు స్పందిస్తూ ఇక్కడ ప్రేమానురాగాల కంటే ప్రజల ప్రాణాలు ఎంతో ముఖ్యమని, ఆరిఫ్ రాష్ట్రంలో అడుగు పెట్టగానే ఎట్టిపరిస్థితుల్లో అతడిని 14 రోజుల పాటు క్వారంటైన్ చేస్తామని కథువా జిల్లా అదనపు న్యాయమూర్తులు చెబుతున్నారు

Updated Date - 2020-04-06T01:36:59+05:30 IST