కరోనా అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-04-07T08:06:47+05:30 IST

దగ్గు, జలుబు ఉన్న వ్యక్తి, తనకు కరోనా సోకిందన్న అనుమానంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో జమాల్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. తొలుత దగ్గు, అనంతరం జలుబు రావడంతో గ్రామస్తులు...

కరోనా అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య

బందా, ఏప్రిల్‌ 6: దగ్గు, జలుబు ఉన్న వ్యక్తి, తనకు కరోనా సోకిందన్న అనుమానంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో జమాల్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. తొలుత దగ్గు, అనంతరం జలుబు రావడంతో గ్రామస్తులు అతడికి కరోనా సోకిందంటూ వ్యాఖ్యలు చేశారని.. దీంతో తన గదికే పరిమితమయ్యాడని కుటుంబసభ్యులు పోలీసులకు వెల్లడించారు. అదే భయంతో ఉరేసుకుని గదిలో మరణించినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 


Read more