రాముడిపై సోషల్ మీడియాలో పోస్ట్.. వ్యక్తి అరెస్ట్
ABN , First Publish Date - 2020-08-21T01:18:04+05:30 IST
దేవదుర్గ పోలీసు స్టేషన్‌లో ఓ ముస్లీం వ్యక్తిపై ఓ హిందూ సంస్థకు చెందిన వారు కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జ్యూడీషియర్ కస్టడీకి పంపించినట్లు పోలీసులు

బెంగళూరు: సోషల్ మీడియాలో ఓ వ్యక్తి.. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ తాలూకకు చెందిన 20 ఏళ్ల వ్యక్తి.. ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ పోస్ట్‌ను తన వాట్సప్‌లో షేర్ చేశాడు. ఇందులో హిందూ మతానికి చెందిన రాముడిపై అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి. బెంగళూరు నగరంలో అల్లర్లు జరిగిన కొద్ది రోజులకే ఇలా జరగడంతో కొంచెం తీవ్ర స్థాయిలో స్పందించాల్సి వచ్చిందని పోలీసుల నుంచి సమాచారం.
దేవదుర్గ పోలీసు స్టేషన్‌లో ఓ ముస్లీం వ్యక్తిపై ఓ హిందూ సంస్థకు చెందిన వారు కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జ్యూడీషియర్ కస్టడీకి పంపించినట్లు పోలీసులు తెలిపారు. అయితే దేవదుర్గ ప్రాంతంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఎలాంటి అమానుష ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు పేర్కొన్నారు.