భయంతో పరారీయత్నం - మృతి

ABN , First Publish Date - 2020-04-07T05:30:00+05:30 IST

కరోనా అనుమానితుడు ఆస్పత్రి నుంచి పారిపోవడానికి ప్రయత్నించి మరణించిన సంఘటన హర్యానా రాష్ట్రంలోని కర్నల్‌లో చోటుచేసుకుంది. పానిపట్‌ జిల్లా నూపూర్‌ గ్రామానికి చెందిన శివచరణ్‌ (55) పలు రకాల వ్యాధులతో...

భయంతో పరారీయత్నం - మృతి

  • రిపోర్ట్‌లో నెగెటివ్‌


కర్నాల్‌, ఏప్రిల్‌ 6: కరోనా అనుమానితుడు ఆస్పత్రి నుంచి పారిపోవడానికి ప్రయత్నించి మరణించిన సంఘటన హర్యానా రాష్ట్రంలోని కర్నల్‌లో చోటుచేసుకుంది. పానిపట్‌ జిల్లా నూపూర్‌ గ్రామానికి చెందిన శివచరణ్‌ (55) పలు రకాల వ్యాధులతో కర్నల్‌ కల్పనా చావ్లా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో ఏప్రిల్‌ 1న చేరాడు. అయితే అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో తనకు కరోనా వచ్చిందేమో అనే భావనలో బెడ్‌ షీట్లను తాడుగా చేసుకుని పారిపోవడానికి ప్రయత్నించి ఆస్పత్రిలోని ఆరో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ఘటనలో శివచరణ్‌ అక్కడిక్కడే మరణించాడు. అయితే అతనికి నెగెటివ్‌గా రిపోర్టు రావడం గమనార్హం.


Read more