వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీకి మమత షాక్

ABN , First Publish Date - 2020-05-11T22:03:16+05:30 IST

అన్ని రాష్ట్రాల సీఎంలతో జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్‌లో బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు

వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీకి మమత షాక్

కోల్‌కతా : అన్ని రాష్ట్రాల సీఎంలతో జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్‌లో బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేంద్రంపై  సంచలన ఆరోపణలు చేశారు. కరోనాను అడ్డం పెట్టుకుని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని తీవ్రంగా మండిపడినట్లు సమాచారం. ఈ క్లిష్ట సమయంలో ఓ స్క్రిప్ట్‌ను ముందే సిద్ధం చేసుకొని అందుకు అనుగుణంగా రాష్ట్రాలను మార్చుకుంటోందని తీవ్రంగా ఆరోపించారు. ఏ ఒక్కరూ తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే లేదని, ఇష్టమున్నట్లు చేస్తున్నారని కేంద్రంపై మమతా బెనర్జీ  మండిపడ్డారు. 


Updated Date - 2020-05-11T22:03:16+05:30 IST