చడ్డా, నడ్డా, ఫడ్డా, భడ్డా..: బీజేపీపై మమతా ఎదురుదాడి

ABN , First Publish Date - 2020-12-10T23:55:34+05:30 IST

గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. నడ్డా కాన్వాయ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కైలాస్ విజయ వర్గీయ వాహనంపై కూడా ప్రత్యర్థులు రాళ్ల దాడికి దిగారు

చడ్డా, నడ్డా, ఫడ్డా, భడ్డా..: బీజేపీపై మమతా ఎదురుదాడి

కోల్‌కతా: రాష్ట్రంలోకి ఎవరెవరో నాయకులు వస్తున్నారు. వారి సభలకు జనాలు రారు కానీ, వాళ్ల కార్యకర్తలు చేసే హడావుడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకరు వచ్చిపోగానే ఇంకొకరు వచ్చి వెళ్తుంటారు. చడ్డా, నడ్డా, ఫడ్డా, భడ్డా.. ఇట్లా ఎవరెవరో వస్తున్నారంటూ తనదైన శైలిలో మమతా బెనర్జీ సెటైర్లు గుప్పించారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కోల్‌కతా వచ్చి వెళ్లిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీజేపీపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.


‘‘వారికి (బీజేపీ) ఇంకో పనేం లేదు. ఒకసారి హోంమంత్రి ఇక్కడికి వస్తారు. ఆ వెంటనే చడ్డా, నడ్డా, ఫడ్డా, భడ్డా.. ఇట్లా ఎవరెవరో వస్తుంటారు, పోతుంటారు. నిజానికి వారి సభల్లో జనాలే ఉండరు. కానీ ఆ పార్టీ కార్యకర్తలు చేసే హడావుడి చాలా ఎక్కువగా ఉంటుంది’’ అని మమతా బెజర్జీ అన్నారు.


కాగా, గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. నడ్డా కాన్వాయ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కైలాస్ విజయ వర్గీయ వాహనంపై కూడా ప్రత్యర్థులు రాళ్ల దాడికి దిగారు. కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో ఈ దాడి జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రకటించారు.

Updated Date - 2020-12-10T23:55:34+05:30 IST