యువతకు మోటార్ సైకిళ్లు అందజేయనున్న మమతా సర్కారు

ABN , First Publish Date - 2020-11-15T15:10:33+05:30 IST

యువతలో ఆత్మస్థయిర్యం నింపేందుకు బెంగాల్ ప్రభుత్వం ‘కర్మ్ సాథీ స్కీం’ను ప్రవేశపెట్టింది.

యువతకు మోటార్ సైకిళ్లు అందజేయనున్న మమతా సర్కారు

కోల్‌కతా: యువతలో ఆత్మస్థయిర్యం నింపేందుకు బెంగాల్ ప్రభుత్వం ‘కర్మ్ సాథీ స్కీం’ను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని రెండు లక్షల మంది యువతకు మోటార్ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. అలాగే యువతను వ్యవసాయం చేపట్టేదిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సీఎం మమతా బెనర్జీ ఈ పథకం కింద రాష్ట్రంలోని 10 లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. 


వీరిలో 2 లక్షల మంది యువతకు మోటారు సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ మోటారు సైకిళ్లకు వెనుక భాగంలో ప్రత్యేకమైన బాక్సులను అమర్చనున్నారు. లబ్ధిదారులు ఆ బాక్సులలో తాము విక్రయించాలనుకుంటున్న పండ్లు, కూరగాయలు, దుస్తులు లేదా ఇతర సామగ్రిని ఉంచుకుని విక్రయాలు సాగించవచ్చు. తద్వారా యువత తాము పండించిన పంటను పట్టణాలలో విక్రయించవచ్చు. అలాగే పట్టణాలలో దొరికే వస్తువులను గ్రామాలకు తీసుకువచ్చి విక్రయించవచ్చు. ఈ విధమైన విధానం వలన యువతకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం యువతకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని కూడా కల్పించనుంది.  


Updated Date - 2020-11-15T15:10:33+05:30 IST