మమత ప్రభుత్వంపై గవర్నర్ ఫైర్..

ABN , First Publish Date - 2020-04-15T22:33:12+05:30 IST

పశ్చిమబెంగాల్‌లో లాక్‌డౌన్ అమలు చేస్తున్న తీరుపై గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

మమత ప్రభుత్వంపై గవర్నర్ ఫైర్..

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో లాక్‌డౌన్ అమలు చేస్తున్న తీరుపై గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు, పరిపాలనా అధికారులు లాక్‌డౌన్ ప్రోటోకాల్ పాటించలేదన్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో టీఎంసీ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను సామాజిక దూరం పాటింపచేయడంలో మమత ప్రభుత్వం 100 శాతం విఫలమైందని గవర్నర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్ అమలు చేయలేకపోతే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి పారామిలిటరీ దళాలను తెప్పించుకోవాలని మమత ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించింది.


Updated Date - 2020-04-15T22:33:12+05:30 IST