మాస్క్‌లు దొరక్కపోతే ఇలా చేయండి.. ప్రజలకు మమత సలహా!

ABN , First Publish Date - 2020-03-21T17:10:55+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ...

మాస్క్‌లు దొరక్కపోతే ఇలా చేయండి.. ప్రజలకు మమత సలహా!

హౌరా: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రజలకు ఓ కీలక సూచన చేశారు. ఫేస్ మాస్కులకు కొరత ఏర్పడితే ప్రజలు మెత్తటి వస్త్రాలను ముక్కు, నోటికి కట్టుకోవాలన పేర్కొన్నారు. అయితే అది ఎంత వరకు పనిచేస్తుందో చెప్పలేననీ.. డాక్టర్లను సంప్రదించి వారు చెప్పినట్టు చేయాలని ఆమె అన్నారు. కాగా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తక్షణమే అంతర్జాతీయ నిర్ణయాలను నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘అంతర్జాతీయ విమానాలను మార్చి 22 వరకు ఎందుకు అనుమతించాలి? ఇప్పుడే వాటిని ఆపేయాలని వీడియో కాన్ఫరెన్స్‌లో మేము ప్రధాని మోదీని కోరాం...’’ అని మమత పేర్కొన్నారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య ఇవాళ మరో 20 వరకు పెరిగి 256కు చేరుకున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 63 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-03-21T17:10:55+05:30 IST