మాల్స్ తెరుచుకున్నాక‌‌ ప‌రిస్థితి ఇదేన‌ట‌!

ABN , First Publish Date - 2020-06-22T18:42:33+05:30 IST

లాక్‌డౌన్ ముగిసి, అన్‌లాక్‌ -1 ప్రారంభ‌మ‌య్యాక దేశంలోని మాల్స్ తెరుచుకున్నాయి. అయితే ఆయా మాల్స్‌లో వ్యాపారం అంతకుముందు జ‌రిగిన వ్యాపారంతో పోల్చిచూస్తే ప్ర‌స్తుతం నాలుగవ వంతు కూడా...

మాల్స్ తెరుచుకున్నాక‌‌ ప‌రిస్థితి ఇదేన‌ట‌!

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ ముగిసి, అన్‌లాక్‌ -1 ప్రారంభ‌మ‌య్యాక దేశంలోని మాల్స్ తెరుచుకున్నాయి. అయితే ఆయా మాల్స్‌లో వ్యాపారం అంతకుముందు జ‌రిగిన వ్యాపారంతో పోల్చిచూస్తే ప్ర‌స్తుతం నాలుగవ వంతు కూడా జ‌ర‌గ‌డం లేద‌ట‌. ఈ స‌మాచారం రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సర్వేలో వెల్ల‌డ‌య్యింది. గ‌త ఏడాది జూన్ నాటి వ్యాపారంతో పోల్చి చూస్తే, ప్ర‌స్తుత జూన్ మొదటి పక్షంలో మాల్స్‌లో వ్యాపారం 77 శాతం మేర‌కు దిగ‌జారింది. అంటే 23 శాతం మేర‌కే వ్యాపారం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఇదేవిధంగా రిటైల్ మార్కెట్ వ్యాపారం కూడా  61 శాతం మేర‌కు పడిపోయింది. వినియోగ‌దారులు క‌రోనా భ‌యం కార‌ణంగా మాల్స్‌కు రావ‌డం మానేశార‌ని దుకాణ‌దారులు అంటున్నారు. కాగా ఇటీవల నిర్వ‌హించిన‌ వినియోగదారుల సర్వేలో లాక్‌డౌన్ త‌రువాత ‌కూడా ప్రతి ఐదు మందిలో న‌లుగురు తమ షాపింగ్ ఖర్చులను తగ్గించుకున్నార‌ని వెల్ల‌డ‌య్యింది. 


Updated Date - 2020-06-22T18:42:33+05:30 IST