మాలేగాం కేసులో కోర్టుకు ఎంపీ ప్రగ్యా డుమ్మా

ABN , First Publish Date - 2020-12-19T12:10:12+05:30 IST

మాలేగాం పేలుడు కేసులో నిందితురాలైన బీజేపీ ఎంపీ ప్రగ్యాఠాకూర్ అనారోగ్య కారణాలు చూపిస్తూ ముంబై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విచారణకు హాజరు కాలేదు....

మాలేగాం కేసులో కోర్టుకు ఎంపీ ప్రగ్యా డుమ్మా

ముంబై : మాలేగాం పేలుడు కేసులో నిందితురాలైన బీజేపీ ఎంపీ ప్రగ్యాఠాకూర్ అనారోగ్య కారణాలు చూపిస్తూ ముంబై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విచారణకు హాజరు కాలేదు. 2008లో మాలేగాంలో జరిగిన పేలుడు ఘటనలో నిందితురాలైన ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ ట్రయల్ కోర్టు విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మాలేగాం పేలుడు కేసులో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సుధీర్ఘ కాలం తర్వాత ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో సాక్షులను పిలవాలని కోర్టు నిర్ణయించింది. ఈ కేసులో నిందితులైన ఏడుగురు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. 


 ప్రగ్యా సాధ్వీజీ ముంబైకు రావాలని నిర్ణయించుకొని విమానాశ్రయానికి సమీపంలోని నందగిరి గెస్టుహౌస్ ను బుకింగ్  చేశారని, కాని ఆమెకు రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేరమని కోరారని ఆమె తరపున న్యాయవాది జేపీ మిశ్రా చెప్పారు. ప్రగ్యా ఠాకూర్ కు గతంలో ఎయిమ్సు ఆసుపత్రిలో కంటి ఆపరేషణ్ చేయించుకుంది.2008లో మాలేగాం పట్టణంలోని మసీదు సమీపంలో మోటారుసైకిలులో పేలుడు పరికరం ఉంచి పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరో వందమంది గాయపడ్డారు. 


అయితే ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్, రమేష్ ఉపాధ్యాయ, సుధాకర్ దివేది, సుధాకర్ చతుర్వేదిలు కోర్టుకు రాలేదు. కొవిడ్ -19 ఆంక్షల వల్ల వారు కోర్టుకు హాజరు కాలేక పోయారని వారి తరపున న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. దీంతో మళ్లీ డిసెంబరు 19వతేదీన నిందితులందరినీ హాజరుకావాలని కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. దీంతో ఎంపీ ప్రగ్యాసింగ్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేరారని అతని న్యాయవాది చెప్పారు.

Updated Date - 2020-12-19T12:10:12+05:30 IST