అంతటి కీలక నిర్ణయం జవదేకర్‌కు తెలియదా?
ABN , First Publish Date - 2020-03-08T22:41:02+05:30 IST
రెండు మలయాళ వార్తా ఛానళ్లపై నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార శాఖ తీసుకున్న నిర్ణయం సంబంధిత మంత్రి ప్రకాశ్

న్యూఢిల్లీ : రెండు మలయాళ వార్తా ఛానళ్లపై నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార శాఖ తీసుకున్న నిర్ణయం సంబంధిత మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు తెలియదా? ఆయనకు తెలియకుండానే ఇంతటి కీలక నిర్ణయం వెలువడిందా? అంటే అవుననే అంటున్నాయి న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్ అథారిటీ వర్గాలు. మలయాళం ఛానళ్లపై నిషేధం విధించాలన్న నిర్ణయం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు తెలియకుండానే జరిగిపోయిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఎన్.బీ.ఏ. అధ్యక్షుడు రజత్ శర్మ డిమాండ్ చేశారు.
కేరళలో ఉన్న ఏషియానెట్ న్యూస్‌తో పాటు మీడియా వన్ ఛానల్ పై నిషేధం విధించడాన్ని తాము ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఇంతటి కీలక నిర్ణయం కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు తెలియక పోవడంపై మండిపడ్డారు. ఆయన అనుమతి లేకుండానే సంబంధిత మంత్రిత్వ శాఖ ఇంతటి కీలక నిర్ణయం ఎలా తీసుకుందన్న దానిపై వెంటనే ఓ సమగ్ర విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న హింసపై మత సామరస్యాన్ని దెబ్బతీసేలా కథనాలు ప్రసారం చేశారన్న కారణంతో కేరళలోని ఏషియా నెట్ న్యూస్‌తో పాటు మీడియా వన్ అనే ఛానళ్లపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ 48 గంటల పాటు నిషేధం విధించింది. అయితే ఏషియా నెట్ ఛానల్‌పై శుక్రవారం అర్ధరాత్రి 1.30 నిమిషాలకు, మీడియా వన్ పై ఉదయం 9.30 నిమిషాలకు నిషేధం ఎత్తివేస్తున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటించింది.