కరోనా నుంచి కోలుకోవడం సంతోషంగా ఉంది: మలైకా

ABN , First Publish Date - 2020-09-20T22:01:50+05:30 IST

కరోనా నుంచి కోలుకోవడం సంతోషంగా ఉంది: మలైకా

కరోనా నుంచి కోలుకోవడం సంతోషంగా ఉంది: మలైకా

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్నట్లు నటి మలైకా అరోరా ఆదివారం తెలిపారు. చాలా రోజుల తరువాత చివరకు నా గది నుంచి బయట పడ్డాను అని పేర్కొంది. అది ఒక విహారయాత్రలా అనిపిస్తుందని, ఈ వైరస్ కనీస నొప్పి మరియు అసౌకర్యంతో అధిగమించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఈ ప్రక్రియ నుంచి ఇబ్బంది లేకుండా చేసినందుకు నా వైద్యులు, బీఎంసీకి పెద్ద కృతజ్ఞతలు తెలిపినట్లు మలైకా వెల్లడించింది.

Updated Date - 2020-09-20T22:01:50+05:30 IST