ఖాళీ రైళ్లకు తడిసిమోపెడవుతున్న ఖర్చు!

ABN , First Publish Date - 2020-10-03T14:16:25+05:30 IST

కరోనా కాలంలో ప్రయాణికుల రవాణాను మించి సరకు రవాణాలో రికార్డులు సృష్టించిన రైల్వేశాఖ ఖాళీగా నిలిపి ఉంచిన రైళ్ల మెయింటనెన్స్ విషయంలో...

ఖాళీ రైళ్లకు తడిసిమోపెడవుతున్న ఖర్చు!

న్యూఢిల్లీ: కరోనా కాలంలో ప్రయాణికుల రవాణాను మించి సరకు రవాణాలో రికార్డులు సృష్టించిన రైల్వేశాఖ ఖాళీగా నిలిపి ఉంచిన రైళ్ల మెయింటనెన్స్ విషయంలో సమతమవుతోంది. భారతీయ రైల్వే విభాగానికి చెందిన 11,000కు పైగా రైళ్లు ప్రస్తుతం నడవడం లేదు. అయితే వాటి మెయింటెన్స్‌కు అయ్యే ఖర్చు తడిసిమోపెడవుతోంది. 



రైల్వే బోర్డు అధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం అధికశాతం రైళ్లు నడవడం లేదు. వాటిని మెయింటైన్ చేయడం కష్టమవుతోంది. ఈ రైళ్లను కొద్ది దూరమైనా నడుపుతూ ఉండాలి. అప్పుడే అవి సక్రమంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం రైళ్ల రాకపోకలపై ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోకపోవడంతో, నిలిపివుంచిన రైళ్లను పర్యవేక్షించవలసి వస్తోందన్నారు. ఇందుకోసం అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి రావడం రైల్వేశాఖకు భారంగా మారిందన్నారు. 

Updated Date - 2020-10-03T14:16:25+05:30 IST