‘మహా’ ప్రభుత్వం కోసం బీఎస్6 సుప్రో అంబులెన్స్‌ను లాంచ్ చేసిన మహింద్రా

ABN , First Publish Date - 2020-06-16T23:52:03+05:30 IST

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహింద్రా అండ్ మహింద్రా తన పాపులర్ సుప్రో వ్యాన్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి

‘మహా’ ప్రభుత్వం కోసం బీఎస్6 సుప్రో అంబులెన్స్‌ను లాంచ్ చేసిన మహింద్రా

ముంబై: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహింద్రా అండ్ మహింద్రా తన పాపులర్ సుప్రో వ్యాన్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసిన బీఎస్6 సుప్రో అంబులెన్స్‌ను మంగళవారం లాంచ్ చేసింది. దీని ధర రూ. 6.94 లక్షలు(ఎక్స్ షో రూం, ముంబై). ఇందులో ‘ఎల్ఎక్స్’, ‘జడ్ఎక్స్’ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. ఫస్ట్ బ్యాచ్ వాహనాలను ప్రత్యేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 అవసరాల కోసం తయారు చేసింది. 


సుప్రో అంబులెన్స్‌లో ఫోల్డబుల్ స్ట్రెచర్ కమ్ ట్రాలీ, మెడికల్ కిట్ బాక్స్, ఆక్సిజన్ సిలిండర్, మంటలు ఆర్పే సాధనం, ఇంటర్నల్ లైటింగ్, మంటలను తట్టుకోగలిగే లోపలి భాగాలు, అనౌన్స్‌మెంట్ సిస్టం వంటి అత్యవసర పరికరాలను అమర్చారు. 

 

Updated Date - 2020-06-16T23:52:03+05:30 IST