‘మిత్రో’ అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి: మహారాష్ట్ర సైబర్ సెక్యూరిటీ

ABN , First Publish Date - 2020-06-04T22:39:41+05:30 IST

టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన సరికొత్త యాప్ మిత్రో. చైనా అప్లికేషన్లను నిషేధించాలనే ఉద్యమం దేశంలో...

‘మిత్రో’ అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి: మహారాష్ట్ర సైబర్ సెక్యూరిటీ

ముంబై: టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన సరికొత్త యాప్ మిత్రో. చైనా అప్లికేషన్లను నిషేధించాలనే ఉద్యమం దేశంలో ఊపందుకోవడంతో ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే ఈ అప్లికేషన్‌ను పాకీస్తాన్‌లోని టిక్ టిక్ అనే అప్లికేషన్‌తో సోర్స్‌కోడ్ సాయంతో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ అప్లికేషన్‌ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసేయాల్సిందిగా ప్రజలను హెచ్చరిస్తోంది. ఈ అప్లికేషన్‌ను వినియోగించడం వల్ల వ్యక్తికగ సమాచారం చోరీ అయ్యే ప్రమాదమే కాక ఇందులోని ఖాతాలను హ్యాకర్లు సులభంగా హ్యాక్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. వెంటనే ఈ అప్లికేషన్‌ను మొబైల్ నుంచి డిలీట్ చేసేయాలని సూచిస్తోంది.

Updated Date - 2020-06-04T22:39:41+05:30 IST