మహారాష్ట్రలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-08T01:43:40+05:30 IST

మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే మహారాష్ట్రలో...

మహారాష్ట్రలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,018కి చేరింది.


ఒక్క ముంబై నగరంలోనే 590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబై తర్వాత పుణెలో అత్యధిక కేసులు వెలుగుచూస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు వెయ్యి దాటడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లాక్‌డౌన్ పొడిగింపునకు విజ్ఞప్తి చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. గత 24 గంటల్లో మహారాష్ట్రలో ప్రాంతాల వారీగా నమోదైన కేసులివి...


గత 24 గంటల్లో మహారాష్ట్రలో నమోదైన కరోనా కేసులు-150

ముంబై- 116

పుణె-18

నగర్-3

బుల్ధన-2

థానే-2

నాగ్‌పూర్-3

సతారా-1

రత్నగిరి-1

ఆబాద్-3

సంగ్లి-1

Read more