అక్కడ కరోనా తాండవిస్తున్నా జూలై ఒకటి నుంచి స్కూల్స్ షురూ!
ABN , First Publish Date - 2020-06-18T16:23:21+05:30 IST
కరోనా వైరస్ కారణంగా దేశంలోని అన్ని విద్యాసంస్థలను మూసివేశారు. అయితే జూలై ఒకటి నుంచి తమ రాష్ట్రంలోని పాఠశాలలను, కళాశాలలను ప్రారంభిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ముంబై: కరోనా వైరస్ కారణంగా దేశంలోని అన్ని విద్యాసంస్థలను మూసివేశారు. అయితే జూలై ఒకటి నుంచి తమ రాష్ట్రంలోని పాఠశాలలను, కళాశాలలను ప్రారంభిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, జూలై ఒకటి నుంచి రెడ్ జోన్ మినహా మిగిలిన ప్రాంతాలలో జూనియర్ కళాశాలలతో పాటు 9 వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఆగస్టులో 6 నుంచి 8 వరకు తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌థాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3.50 లక్షలకు చేరుకోగా, మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.