మహారాష్ట్రలో ఏ మాత్రం తగ్గని కరోనా.. ఇవాళ కూడా..

ABN , First Publish Date - 2020-07-06T02:08:51+05:30 IST

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో కొత్తగా...

మహారాష్ట్రలో ఏ మాత్రం తగ్గని కరోనా.. ఇవాళ కూడా..

మహారాష్ట్రలో కొత్తగా 6,555 కరోనా కేసులు, 151 కరోనా మరణాలు

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 6,555 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,619కి చేరింది. మరణాల సంఖ్య కూడా మహారాష్ట్రలో అధికంగానే ఉంది. ఇవాళ ఒక్కరోజే 151 మంది కరోనా వల్ల మరణించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 8,822 మంది కరోనా వల్ల మృతి చెందారు.


మహారాష్ట్రలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 86,040. రికవరీ రేటు కూడా మహారాష్ట్రలో కాస్త ఎక్కువగానే ఉండటం కొంత ఊరట కలిగించే విషయం. రికవరీ రేటు 54.08 శాతంగా ఉంది. ఇవాళ ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 3658 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకూ 1,11,740 మంది మహారాష్ట్రలో కరోనా నుంచి కోలుకున్నారు. ముంబై, థానే నగరాల్లో కరోనా కేసులు కలవరపాటుకు కారణమవుతున్నాయి. ముంబైలో ఇప్పటివరకూ 84,524 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 4,899 మంది కరోనా వల్ల మరణించారు.



Updated Date - 2020-07-06T02:08:51+05:30 IST