కరోనా లాక్డౌన్తో మహారాష్ట్రలో ఐదు రూపాయలకే భోజనం
ABN , First Publish Date - 2020-04-08T12:24:19+05:30 IST
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఐదురూపాయలకే భోజనం పెట్టాలని నిర్ణయించింది....

సర్కారు నిర్ణయం
ముంబై : కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఐదురూపాయలకే భోజనం పెట్టాలని నిర్ణయించింది. గతంలో శివ భోజన తాలీని పదిరూపాయలకు అందిస్తుండగా, కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో దీని ధరను 5రూపాయలకు తగ్గిస్తూ మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. మహారాష్ట్రలో ఒక్కరోజే 150 కేసులు నమోదై మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,018 కు చేరడంతో సర్కారు పేదలకు అందిస్తున్న శివభోజన తాలీని 5 రూపాయలకే అందించాలని నిర్ణయించింది.