ఆ రెండు రాష్ట్రాలు ఒకింత చిక్కుల్లో ఉన్నాయి: హర్షవర్ధన్

ABN , First Publish Date - 2020-04-16T01:08:51+05:30 IST

కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఒకింత చిక్కుల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్..

ఆ రెండు రాష్ట్రాలు ఒకింత చిక్కుల్లో ఉన్నాయి: హర్షవర్ధన్

న్యూఢిల్లీ: కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఒకింత చిక్కుల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 పరిస్థితిపై బుదవారంనాడిక్కడ  ఆయన మాట్లాడుతూ, బీహార్ ప్రస్తుతానికి మరీ అంత సమస్యల్లో లేదని, మహారాష్ట్ర, ముఖ్యంగా ముంబై, కర్ణాటక రాష్ట్రాలు కచ్చితంగా ఒకింత చిక్కుల్లోనే ఉన్నాయని చెప్పారు.


'ముగ్గురు సెక్రటరీలు, మరీ ముఖ్యంగా మహారాష్ట్ర సెక్రటరీ చాలా ధీమాతో మేము జాగ్రత్తలు తీసుకుంటాం అని చెప్పడం నాకు ఒకింత సంతోషంగా ఉంది' అని హర్షవర్దన్ వీడియా కాన్ఫరెన్స్‌లో తెలిపారు.


కాగా, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం, మహారాష్ట్రలో 2,687 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 259 మంది పేషెంట్లకు స్వస్థత చేకూరి డిశ్చార్జి అయ్యారు. 179 మంది కరోనా మహమ్మారితో  ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో 277  పాజిటివ్ కేసులు నమోదు కాగా, 75 మందికి పూర్తి స్వస్థత చేకూరింది. 11 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా మొత్తం 11,933 కరోనా పాజిటవ్ కేసులు నమోదు కాగా, వీటిలో 10,197 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,344 మంది డిశ్చార్జి అయ్యారు. 392 మంది మృత్యువాత పడ్డారు.

Updated Date - 2020-04-16T01:08:51+05:30 IST