మహారాష్ట్రలో 70 వేలు దాటిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-06-02T01:55:19+05:30 IST
మహారాష్ట్రలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న...
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సోమవారం ఒక్కరోజే 2361 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేలు దాటింది. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70,013. మహారాష్ట్రలో కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో సోమవారం ఒక్కరోజే 76 మంది చనిపోయారు. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 2362 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.