రాజీవ్ గాంధీకి ఉద్ధవ్ థాకరే నివాళి

ABN , First Publish Date - 2020-08-20T23:08:39+05:30 IST

దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ఘనంగా..

రాజీవ్ గాంధీకి ఉద్ధవ్ థాకరే నివాళి

ముంబై: దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ఘనంగా నివాళి అర్పించారు. ఇవాళ రాజీవ్ గాంధీ 76వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. కాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలోని వీర్ భూమి వద్ద తన తండ్రికి నివాళి అర్పించారు. రాజీవ్ స్మారక స్థలం వద్ద పుష్పాంజలి ఘటించి ప్రార్థనలు చేశారు. ఇవాళ ఉదయం ఆయన ట్విటర్లో స్పందిస్తూ... ‘‘రాజీవ్ గాంధీ అద్భుత దార్శనికత, ముందుచూపు ఉన్న వ్యక్తి. అన్నిటికి మించి ఆయన అత్యంత దయా హృదయం కలిగిన మంచి మనిషి. అలాంటి వ్యక్తిని తండ్రిగా కలిగివుండడం నిజంగా నా అదృష్టం. నేటికీ, ఏనాటికీ ఆయన లేరన్న బాధ మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది..’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-20T23:08:39+05:30 IST