మెట్రోపాలిటన్ పరిధిలో రాకపోకలకు అనుమతి

ABN , First Publish Date - 2020-06-04T23:34:05+05:30 IST

ముంబై మెట్రోపాలిటన్ (ఎంఎంఆర్) పరిధిలో అంతర్ జిల్లాల రాకపోకలకు మహారాష్ట్ర ప్రభుత్వం గురువారంనాడు అనుమతించింది. ముంబై సిటీ...

మెట్రోపాలిటన్ పరిధిలో రాకపోకలకు అనుమతి

ముంబై: ముంబై మెట్రోపాలిటన్ (ఎంఎంఆర్) పరిధిలో అంతర్ జిల్లాల రాకపోకలకు మహారాష్ట్ర ప్రభుత్వం గురువారంనాడు అనుమతించింది. ముంబై సిటీ, ముంబై సబర్బన్, థానే, పాల్గర్, రాయగఢ్ జిల్లాలు ఎంఎంఆర్ పరిధిలోకి వస్తాయి. 'ఎంఎంఆర్ కింద మున్సిపల్ కార్పొరేషన్స్ ఏరియాలో అంతర్ జిల్లా ప్రయాణాలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతిస్తున్నాం' అని మహారాష్ట్ర సర్కార్ ఒక ప్రకటనలో తెలిపింది.


కాగా, మహారాష్ట్రలో ఇంతవరకూ 74,860 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,587 మంది మృతి చెందారు. మరోవైపు, ఒక్క ముంబైలోని ధారవి ఏరియాలో కొత్తగా 23 కోవిడ్-19 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,872కు చేరింది. 71 మంది మృతి చెందినట్టు బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది.

Updated Date - 2020-06-04T23:34:05+05:30 IST