భారతంలోని అర్జునుడు... ఫిరోజ్‌ ఖాన్

ABN , First Publish Date - 2020-04-26T00:49:45+05:30 IST

కొందరి కథనాల ప్రకారం దీని కోసం 23 వేల మంది నటులు ఆడిషన్స్ కు హాజరయ్యారని సమాచారం.

భారతంలోని అర్జునుడు... ఫిరోజ్‌ ఖాన్

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో రామాయణ, మహాభారత సీరియల్స్‌ను దూరదర్శన్‌లో పున: ప్రసారమైన విషయం తెలిసిందే. అంతటి పాత సీరియల్స్‌కి కూడా నేటి ఆధునిక కాలంలో ప్రేక్షకాదరణ చెక్కు చెదరలేదంటే... అతిశయోక్తి కాదు. మహాభారతంలో అర్జునుడి పాత్ర ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. ఆ పాత్రధారి అసలు పేరు తెలుసా.... ఫిరోజ్ ఖాన్. మహా భారత సీరియల్ కోసం పేరు మార్చుకోవాలని స్క్రిప్ట్ రైటర్ రాహి మసూమ్ రాజా సూచించడంతో ఆయన తన పేరును మార్చేసుకున్నారు.


కొందరి కథనాల ప్రకారం దీని కోసం 23 వేల మంది నటులు ఆడిషన్స్ కు హాజరయ్యారని సమాచారం. చివరకు ఫిరోజ్ ఖానే ఎంపికయ్యారు. దీంతో పేరు మార్చుకోవల్సిందేనని స్ర్కిప్ట్ రైటర్ సూచించడంతో ఆయన సరేనన్నాడు. ‘‘పరిశ్రమలో అర్జున్ పేరుతో ఎవరూ లేరు. ఈ పాత్ర నీకు చాలా పేరు తెస్తుంది.’’ అని సలహా ఇవ్వడంతో వెంటనే ఫిరోజ్, అర్జున్ గా పేరు మార్చుకున్నాడు. దీంతో చివరకు ఆయన  అర్జున్ గానే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. 

Updated Date - 2020-04-26T00:49:45+05:30 IST