‘డాన్’ స్టాంపుల జారీలో నిందితులెవరు?
ABN , First Publish Date - 2020-12-30T08:13:21+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మాఫియా డాన్‌ల ముఖచిత్రాలతో స్టాంపులు ముద్రితమవడం పట్ల స్థానిక పోస్టల్ శాఖ
కాన్పూర్ పోస్టల్ శాఖ విచారణ
బ్రాంచి ఇన్‌చార్జి సస్పెన్షన్
న్యూఢిల్లీ, డిసెంబరు 29: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మాఫియా డాన్‌ల ముఖచిత్రాలతో స్టాంపులు ముద్రితమవడం పట్ల స్థానిక పోస్టల్ శాఖ విచారణకు ఆదేశించింది. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. బ్రాంచి ఇన్‌చార్జి రజ్‌నీశ్ కుమార్‌ను విధుల నుంచి తప్పించామని వెల్లడించింది. చోటా రాజన్, మున్నా బజ్‌రంగీల ఫొటోలతో ముద్రితమైన 12 స్టాంపులు సోమవారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. వినియోగదారులు తమ సొంత ఫొటోతోనే స్టాంపును ముద్రించుకునే అవకాశాన్ని కల్పిస్తూ.. కొన్నేళ్ల క్రితం తపాలా శాఖ ‘మై స్టాంప్’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం వినియోగించుకోవాలంటే.. స్టాంపుపై ముద్రించే ఫొటోలు చట్టవిరుద్ధమైనవి కావని, సమాజంలోని విలువలపై దుష్ప్రభావం చూపించేవి కాదని, దేశభక్తికి విరుద్ధం కాదని హామీ ఇస్తూ ఒక డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే.. తాజా ఘటనలో నిందితులు ఎటువంటి డిక్లరేషన్‌నూ సమర్పించలేదని తెలుస్తోంది.