డిగ్రీ పరీక్షలు రద్దు చేసి పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం

ABN , First Publish Date - 2020-06-23T03:52:10+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి...

డిగ్రీ పరీక్షలు రద్దు చేసి పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం

భోపాల్: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డిగ్రీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ చేస్తున్న ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులను గత సంవత్సర పరీక్షా ఫలితాల ఆధారంగా, సెమిస్టర్‌లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా పరీక్షలు నిర్వహించకుండానే తరువాతి తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.


డిగ్రీ, పీజీ ఫైనలియర్ విద్యార్థులను కూడా గత సంవత్సరాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా, సెమిస్టర్స్‌లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్స్ జారీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే.. మార్కులు మరింత మెరుగుపరచుకోవాలని భావించే విద్యార్థులకు ఆఫ్‌లైన్‌లో పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన తేదీలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఏ కారణం వల్లనైనా 12వ తరగతి పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తామని కూడా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.Updated Date - 2020-06-23T03:52:10+05:30 IST