మధ్య ప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ పరిస్థితి విషమం

ABN , First Publish Date - 2020-06-18T22:34:11+05:30 IST

మధ్య ప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని,

మధ్య ప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ పరిస్థితి విషమం

లక్నో : మధ్య ప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, అయితే నియంత్రణలో ఉందని మేదాంత ఆసుపత్రి డైరెక్టర్ రాకేశ్ కపూర్ గురువారం చెప్పారు. 


‘‘ఆయన (టాండన్) వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది, అయితే నియంత్రణలో ఉంది’’ అని రాకేశ్ చెప్పారు. 


ఆయన త్వరగా కోలుకోవాలని తామంతా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయనకు చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు. 


లాల్జీ టాండన్ (85)ను ఈ నెల 11న మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స చేయిస్తున్నారు. 


Updated Date - 2020-06-18T22:34:11+05:30 IST