ప్రతి మంత్రితోనూ ముఖాముఖి సమావేశమవుతాను : శివరాజ్ సింగ్ చౌహాన్

ABN , First Publish Date - 2020-07-22T20:16:20+05:30 IST

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గంలోని

ప్రతి మంత్రితోనూ ముఖాముఖి సమావేశమవుతాను : శివరాజ్ సింగ్ చౌహాన్

భోపాల్ : మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గంలోని మంత్రులతో ఈ నెల 22, 23 తేదీల్లో భేటీ అవుతారు. ప్రతి మంత్రితోనూ ముఖాముఖి మాట్లాడతారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. 


’’ఈరోజు, రేపు (బుధవారం, గురువారం) రెండు రోజులపాటు మంత్రులతో నేను ముఖాముఖి సమావేశమవుతాను. డిపార్ట్‌మెంటల్ సమాచారం, రోడ్ మ్యాప్, డెలివరీ మెకానిజమ్స్ గురించి చర్చిస్తాను. మంత్రులకు ఏదైనా శాఖాపరమైన సమాచారం ఏ విధంగానైనా తెలిస్తే, వారు ఆ సమాచారం ఆధారంగా లోతుగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలి’’ అని శివరాజ్ చెప్పారు. 


మంత్రులతో వారి శాఖల గురించి చర్చించి, సమీక్షిస్తామని తెలిపారు. అదేవిధంగా ‘‘ఆత్మనిర్భర్ మధ్య ప్రదేశ్’’ గురించి చర్చిస్తామన్నారు. మంత్రులు తమ శాఖల గురించి జూలైలో అర్థం చేసుకోవాలని, తాను ఆగస్టు నుంచి ప్రతి శాఖపైనా సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. Updated Date - 2020-07-22T20:16:20+05:30 IST