కొందరు సహకరించడం లేదు: లవ్‌ అగర్వాల్‌

ABN , First Publish Date - 2020-04-01T08:14:59+05:30 IST

దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరగడానికి కారణం కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సహకరించకపోవడమేనని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌అగర్వాల్‌ అన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌...

కొందరు సహకరించడం లేదు: లవ్‌ అగర్వాల్‌

న్యూఢిల్లీ, మార్చి 31: దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరగడానికి కారణం కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సహకరించకపోవడమేనని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌అగర్వాల్‌ అన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రాంతాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. 24 గంటల్లో దేశంలో 227 కొత్త కేసులు నమోదయ్యాయని చెబుతూ కొన్ని ప్రాంతాల్లో ప్రజల సహకారం లేకే కేసులు ఇంతలా పెరిగాయని ఆయన చెప్పారు. కరోనాపై సమష్టిగా పోరాడాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, ఇతర మార్గదర్శకాలు పాటిస్తూ సహకరించాలని కోరారు. కాగా, వైరస్‌ ప్రస్తుతం దేశంలో వైరస్‌ లోకల్‌ (స్థానిక) వ్యాప్తి దశలోనే ఉందని సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 

Updated Date - 2020-04-01T08:14:59+05:30 IST