లగ్జరీ కార్లు దొంగిలించే ముఠా అరెస్ట్... నిందితుల్లో సినిమా నటుడు

ABN , First Publish Date - 2020-06-22T05:06:42+05:30 IST

లక్నో: లగ్జరీ కార్లను దొంగతనం చేసి వాటితో వ్యాపారం చేసే ముఠాను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా వద్ద నుంచి 50 లగ్జరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు లక్నో పోలీస్

లగ్జరీ కార్లు దొంగిలించే ముఠా అరెస్ట్... నిందితుల్లో సినిమా నటుడు

 లక్నో: లగ్జరీ కార్లను దొంగతనం చేసి వాటితో వ్యాపారం చేసే ముఠాను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా వద్ద నుంచి 50 లగ్జరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ పాండే తెలిపారు. ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలను మీడియాకు చూపించారు. అత్యంత ఖరీదైన కార్లు, ఇతర వాహనాలు ఇందులో ఉన్నాయి.


అరెస్టైన వారిలో ఓ సినిమా నటుడు కూడా ఉన్నాడు. ఇతడు మూడు సినిమాల్లో నటించాడని పోలీసులు తెలిపారు. విలేకరిగా కూడా పనిచేస్తున్నాడని వెల్లడించారు. అరెస్టైన వారిలో మరొక నిందితుడు దొంగిలించిన కార్ల ద్వారా వచ్చే సొమ్ముతో బ్యాంకాక్‌లో హోటల్ నిర్మిస్తున్నాడని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది. 

Updated Date - 2020-06-22T05:06:42+05:30 IST