ఎల్‌అండ్‌టీ, టాటాలకు ‘అయోధ్య’
ABN , First Publish Date - 2020-11-03T07:07:50+05:30 IST
అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎల్‌అండ్‌టీ, టాటా నిర్మాణ సంస్థల ద్వారా చేపట్టదలచినట్టు ఉడుపి పెజావర పీఠాధిపతి విశ్వప్రసన్నతీర్థ స్వామీజీ వెల్లడించారు...
- రామమందిర నిర్మాణం చేపట్టనున్న ఎల్‌అండ్‌టీ
బెంగళూరు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎల్‌అండ్‌టీ, టాటా నిర్మాణ సంస్థల ద్వారా చేపట్టదలచినట్టు ఉడుపి పెజావర పీఠాధిపతి విశ్వప్రసన్నతీర్థ స్వామీజీ వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తరభారత పర్యటనలో ఉన్న స్వామీజీ అయోధ్యను సందర్శించారు. రామమందిర నిర్మాణ విషయమై ఆరా తీశారు. ఆ వివరాలను ఉడుపి పెజావరమఠం సోమవారం ఓ ప్రకటనలో తెలియజేసింది. రామమందిర నిర్మాణాలు ఎల్‌అండ్‌టీ కంపెనీ చేపడుతుందని స్వామీజీ తెలిపారు. పనుల పర్యవేక్షణ టాటా కంపెనీ చూస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు రెండు కంపెనీలూ అంగీకరించాయని వివరించారు.