ధర్మెగౌడ ఆత్మహత్యపై దర్యాప్తు జరిపించాలి: లోక్‌సభ స్పీకర్

ABN , First Publish Date - 2020-12-30T23:48:05+05:30 IST

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మే గౌడ ఆత్మహత్యపై ఉన్నతస్థాయి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని

ధర్మెగౌడ ఆత్మహత్యపై దర్యాప్తు జరిపించాలి: లోక్‌సభ స్పీకర్

న్యూ ఢిల్లీ: కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మే గౌడ ఆత్మహత్యపై ఉన్నతస్థాయి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా కోరారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ధర్మెగౌడ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో చైర్మన్ సీట్లో కూర్చున్న ధర్మెగౌడను విపక్ష నేతలు లాగిపడేసిన విషయం తెలిసిందే. దీనిని ఉటంకించిన ఓం బిర్లా.. ఈ ఘటన ప్రజాస్వామ్యంపై జరిగిన అతి పెద్ద దాడిగా పేర్కొన్నారు. శాసనసభల ప్రతిష్టను, ప్రిసైడింగ్ అధికారుల గౌరవం, స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులందరిపై ఉందన్నారు. 

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మెగౌడ సోమవారం నాడు చిక్‌మంగళూరులోని కడూర్ వద్ద రైల్వే కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ధర్మెగౌడ ఆత్మహత్యకు ప్రతిపక్షాల వైఖరే కారణమంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నారు. ధర్మెగౌడ జేడీఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

Updated Date - 2020-12-30T23:48:05+05:30 IST