విటమిన్ డీ లోపం.. అధికమవుతున్న కరోనా మరణాలు!

ABN , First Publish Date - 2020-05-09T22:02:39+05:30 IST

విటమిన్ డీ లోపం కారణంగా కరోనా కేసులు, మరణాలు అధికమయ్యే అవకాశం ఉన్నట్టు యూరప్ దేశాల్లో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది.

విటమిన్ డీ లోపం.. అధికమవుతున్న కరోనా మరణాలు!

లండన్: విటమిన్ డీ లోపం కారణంగా కరోనా కేసులు, మరణాలు అధికమయ్యే అవకాశం ఉన్నట్టు యూరప్ దేశాల్లో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది. బ్రిటన్‌లోని యాంగ్లియా రస్కిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దాదాపు 20 యూరప్ దేశాల్లో చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విటమిన్ డీ లోపం కారణంగా కరోనా బాధితుల్లో ఊపిరితిత్తుల సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశామున్నట్టు వారు గుర్తించారు.


రోగనిరోధక శక్తి పనితీరును విటమిన్ డీ ప్రభావితం చేస్తుంతదని, తెల్ల రక్తకణాలు విడుదల చేసిన సైటోకైన్ల స్థాయిల్లో మార్పులు తెస్తుందని వారు తెలిపారు. వైరస్‌ను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించే సైటోకౌన్లు.. విటమిన్ డీ లోపించినప్పుడు మాత్రం అధిక స్థాయిలో విడుదలై ఊపిరితిత్తులకు చేటు తెస్తాయని వారు అన్నారు. ఈ విధంగా రోగి పరిస్థితి మరింతగా దిగజారీ మరణం సంభవించే అవకాశం ఉందని వారు ప్రతిపాదిస్తున్నారు. ఇతర యూరప్ దేశాలతో పోలిస్తే విటమిన్ డీ సగలు స్థాయి తక్కువగా ఉండే  ఇటలీ స్పెయిన్‌లలో కరోనా మరణాల రేటు ఎక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనమని వారు చెప్పారు. 

Updated Date - 2020-05-09T22:02:39+05:30 IST