హర్యానాలో స్వల్ప భూకంపం.. వరుసగా రెండో రోజు...

ABN , First Publish Date - 2020-06-19T14:31:35+05:30 IST

హర్యానాలో వరుసగా రెండో రోజు స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున..

హర్యానాలో స్వల్ప భూకంపం.. వరుసగా రెండో రోజు...

రోహతక్: హర్యానాలో వరుసగా రెండో రోజు స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున 5:37కి రోహతక్‌కి తూర్పు- ఆగ్నేయంలోని 15 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం కేంద్రీకృతమైనట్టు జాతీయ సీస్మాలజీ కేంద్రం వెల్లడించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 2.3గా నమోదైనట్టు తెలిపింది. కాగా నిన్న కూడా ఉదయం 4:18 సమయంలో రోహతక్‌ సమీపంలో భూమి కంపించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రం 2.1గా నమోదైంది. సాధారణంగా రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5 కన్నా తక్కువగా ఉంటే పెద్దగా ప్రమాదం ఉండదనీ.. బలహీన లేదా నాణ్యత లోపించిన నిర్మాణాలుంటే తప్ప వీటిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దేశ రాజధాని ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో తరచూ తక్కువ తీవ్రతతో కూడిన భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. 

Updated Date - 2020-06-19T14:31:35+05:30 IST