అలిగిన ప్రియురాలు.. స్కూటీకి నిప్పంటించిన ప్రియుడు

ABN , First Publish Date - 2020-03-21T15:02:36+05:30 IST

అలిగి మాట్లాడకుండా ఉండడంతో ప్రియురాలి తీరుతో విరక్తిచెందిన ఆమె స్కూటీకి ప్రియుడు నిప్పంటించిన ఘటన కలకలానికి దారితీసింది. స్థానిక విల్లివాక్కం జగన్నాథన్‌ వీధిలోని ఓ ఇంటి ప్రాంగణంలో పార్కింగ్‌ చేసిన ద్విచక్రవాహనాలకు గుర్తుతెలియని

అలిగిన ప్రియురాలు.. స్కూటీకి నిప్పంటించిన ప్రియుడు

చెన్నై : అలిగి మాట్లాడకుండా ఉండడంతో ప్రియురాలి తీరుతో విరక్తిచెందిన ఆమె స్కూటీకి ప్రియుడు నిప్పంటించిన ఘటన కలకలానికి దారితీసింది. స్థానిక విల్లివాక్కం జగన్నాథన్‌ వీధిలోని ఓ ఇంటి ప్రాంగణంలో పార్కింగ్‌ చేసిన ద్విచక్రవాహనాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీనిపై బాధితులు రాజమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అదే ప్రాంతానికి చెందిన రాజేష్‌ (24) అనే యువకుడు ద్విచక్రవాహనానికి నిప్పంటించడం ఫుటేజీలో కనిపించింది. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా, ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, గత మూడు నెలలుగా ఆమె మాట్లాడక పోవడంతో ఆమె వాహనానికి, ఆమె తండ్రి వాహనానికి నిప్పంటించినట్లు అంగీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - 2020-03-21T15:02:36+05:30 IST