వారిద్దరూ ప్రేమికులు.. వారు చేసే పనులు మాత్రం..

ABN , First Publish Date - 2020-03-13T12:53:48+05:30 IST

ప్రయాణికులు, పాదచారుల వద్ద చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ప్రేమజంటను పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక ఆవడి, తిరుముల్లైవాయల్‌ ప్రాంతాల్లో చైన్‌ స్నాచింగ్‌లు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో తిరుముల్లైవాయల్‌ రైల్వేస్టేషన్‌లో

వారిద్దరూ ప్రేమికులు.. వారు చేసే పనులు మాత్రం..

చెన్నై: ప్రయాణికులు, పాదచారుల వద్ద చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ప్రేమజంటను పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక ఆవడి, తిరుముల్లైవాయల్‌ ప్రాంతాల్లో చైన్‌ స్నాచింగ్‌లు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో తిరుముల్లైవాయల్‌ రైల్వేస్టేషన్‌లో బుధవారం రాత్రి పోలీసులు గస్తీ చేపట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ యువకుడు, యువతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారు విల్లివాక్కంకు చెందిన రంజిత్‌కుమార్‌ (19), జెనిఫర్‌ (21)లని, వీరిద్దరు ప్రేమికులని తెలిసింది. వీరు కలసి వెళుతూ పాదచారులతో మాట్లాడుతున్నట్లు నటించి వారి నగలను అపహరిస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో, ప్రేమజంటను అరెస్ట్‌ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచి, జైలుకు తరలించారు.

Updated Date - 2020-03-13T12:53:48+05:30 IST