లవ్‌జిహాద్ ఆర్డినెన్సు నేపథ్యంలో ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-11-27T15:11:25+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కారు లవ్‌జిహాద్ ఆర్డినెన్స్ తీసుకువచ్చిన నేపథ్యంలో సమాజ్‌వాదీపార్టీ ఎంపీ హసన్ సంచలన వ్యాఖ్యలు....

లవ్‌జిహాద్ ఆర్డినెన్సు నేపథ్యంలో ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కారు లవ్‌జిహాద్ ఆర్డినెన్సు తీసుకువచ్చిన నేపథ్యంలో సమాజ్‌వాదీపార్టీ ఎంపీ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిమ్ యువకులు హిందూ యువతులను సోదరీమణులుగా పరిగణించాలని ఎంపీ ఎస్టీ హసన్ కోరారు. ముస్లిమ్ యువకులు లవ్‌జిహాద్ ఆర్డినెన్సు వలలో పడకూడదని ఎంపీ సూచించారు. యూపీ సర్కారు లవ్‌జిహాద్ ఆర్డినెన్సు‌ను తీసుకువచ్చిన రెండురోజుల తర్వాత ఎంపీ హసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘లవ్ జిహాద్ ఒక రాజకీయ స్టంట్. మన దేశంలోని వ్యక్తులు తమ భాగస్వాములను ఎన్నుకునే హక్కు ఉంది. హిందువులు ముస్లింలను వివాహం చేసుకుంటారు, ముస్లింలు హిందువులను వివాహం చేసుకుంటారు. కాని, మీరు అలాంటి కేసుల్లోకి వస్తే ఇబ్బంది. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను తమ సోదరీమణులుగా పరిగణించాలని నేను కోరుతున్నాను. లేకపోతే, వారిని ప్రభుత్వం హింసించగలదు’’ అని ఎంపీ హసన్ చెప్పారు. 


కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు యోగి సర్కారు చర్యను విమర్శించాయి. ఆర్డినెన్సు ఆమోదించినందుకు బుధవారం ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రం నిరుద్యోగం  ఇతర సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ‘లవ్ జిహాద్’ చట్టాన్ని తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. ‘లవ్ జిహాద్’ అనేది సామాజిక అశాంతిని సృష్టించడానికి బీజేపీ రూపొందించిన పదం అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.


బీజేపీ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు హిందువులు, ముస్లింల మధ్య దూరాన్ని సృష్టిస్తుందని  ఆయన ఆరోపించారు. ‘లవ్ జిహాద్’ ఆరోపణలపై కేసులను ఎదుర్కొనేందుకు వివాదాస్పదమైన ‘లవ్ జిహాద్’ ఆర్డినెన్సు‌ను మంగళవారం ఉత్తరప్రదేశ్ కేబినెట్ ఆమోదించింది. కొత్త చట్టం ప్రకారం లవ్ జిహాద్ వివాహాలకు, బలవంతంగా మత మార్పిడులు చేసిన కేసుల్లో దోషులుగా తేలితే వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. మైనర్ బాలికలు లేదా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలను బలవంతంగా మతమార్పిడి చేసిన కేసుల్లో దోషులుగా తేలిన వారు కూడా భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - 2020-11-27T15:11:25+05:30 IST